దిశ, బాసర : మండల కేంద్రంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు గత రెండు రోజుల్లో గ్రామంలోని 4 ఇండ్లల్లో చోరికి పాల్పడ్డారు. సంఘటన జరిగిన పక్కింటి వాళ్ళకు అనుమానం వచ్చి పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో చోరీ విషయం బహిర్గతం అయ్యింది. ఇంటి యజమానులు వచ్చిన తర్వాత చోరీ సొత్తు తెలుస్తుందని పోలీస్లు అంటున్నారు. వరుసగా దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఐతే వరుసగా దొంగతనాలు జరుగుతుంటే పోలీస్ యంత్రాంగం రాత్రుల్లో పెట్రోలింగ్ జరుపుతుందా అని ప్రజలు అనుమానిస్తున్నారు.