సీతక్క పై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. టీపీసీసీ సభ్యులు

తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పై సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ సభ్యులు ఎండి హర్షద్ హుస్సేన్ అన్నారు.

Update: 2024-11-27 09:41 GMT

దిశ, బెజ్జూర్ : తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పై సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ సభ్యులు ఎండి హర్షద్ హుస్సేన్ అన్నారు. బుధవారం బెజ్జూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన విద్యార్థిని శైలజ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తీసుకుంటుందని తెలిపారు.

విద్యార్థి మృతికి సీతక్కను బాధ్యత రాలిగా చేస్తూ, బాధ్యత వహించి రాజీనామా చేయడం ఎంతవరకు సమంజసం ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఎమ్మెల్యే హరీష్ బాబు నెరవేర్చలేదని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతిని బీఆర్ఎస్, బీజేపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ విట్టల్ బాధిత కుటుంబానికి లక్ష ఇరవై వేల రూపాయలు, ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరిని ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రేణిగుంట్ల పెంటయ్య, తేలి రాజేశ్, సల్మాన్ ఖాన్, నారాయణ, బక్కయ్య, ఎర్రయ్య నందయ్య, తదితరులు పాల్గొన్నారు.


Similar News