సమస్యలు పరిష్కరించండి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, పెంచికలపేట మండలాల్లోని పలు సమస్యలపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి దనసరి సీతక్కని ఆదివాసి గిరిజన నాయకులు ఆదివారం హైదరాబాద్​లో కలిశారు.

Update: 2024-09-15 09:34 GMT

దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, పెంచికలపేట మండలాల్లోని పలు సమస్యలపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి దనసరి సీతక్కని ఆదివాసి గిరిజన నాయకులు ఆదివారం హైదరాబాద్​లో కలిశారు. బెజ్జూరు మండలంలోని సోమేని నుంచి గూడెం వరకు రోడ్డు, పలు వంతెనలు, పెంచికలపేట మండలంలోని కమ్మర్గాం, మురళి గూడెం రోడ్లు, పలు గ్రామాల్లో విద్యుత్ లో వోల్టేజీ సమస్యలు, పోడు భూముల పట్టాల విషయాల గురించి మంత్రికి వివరించారు.

     మంత్రి సానుకూలంగా స్పందించినట్లు గిరిజన నాయకులు తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి సుగుణక్క ఆధ్వర్యంలో గిరిజన నాయకులంతా మంత్రిని కలిశారు. మంత్రిని కలిసిన వారిలో గిరిజన నాయకులు కొడుప విశ్వేశ్వరరావు, శంకర్, లాలయ్య, రమేష్, వినోద్ తదితరులు ఉన్నారు. 

Tags:    

Similar News