పెన్షన్ ఇప్పిస్తానని బురిడీ..!

పెన్షన్ ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించి, డబ్బులు కాజేసిన ఘటన సోమవారం ఉదయం బైంసా పట్టణంలో చోటు చేసుకుంది.

Update: 2024-11-25 09:24 GMT

దిశ, భైంసా : పెన్షన్ ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించి, డబ్బులు కాజేసిన ఘటన సోమవారం ఉదయం బైంసా పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కుబీర్ మండలం మాలేగం గ్రామానికి 60 ఏండ్ల గంగాధర్ భైంసా బస్టాండ్ పక్కన గల ఎస్బీఐ బ్యాంకు నుంచి 30,000 రూపాయలను విత్ డ్రా చేసి బయటకు వచ్చాడు.

అప్పుడే ఓ గుర్తు తెలియని వ్యక్తి నెలకు రూ. 28,000 పెన్షన్ ఇప్పిస్తా తాత అంటూ..! పలకరించి, బస్టాండ్ ముందర గల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడే రూ. 19,000 లను తీసుకొని, సంబంధిత పత్రం పై సార్ వద్ద నుండి సంతకం తీసుకొస్తానంటూ అక్కడి నుంచి జంప్ అయ్యాడు. తాను వచ్చే వరకు అక్కడే ఉండమని వెళ్ళిపోయాడు. అతను ఎంతకీ రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరాలు ద్వారా నిందితున్ని గుర్తించే పనిలో పడ్డారు. నిందితుడు మాస్క్ వేసుకొని ఈ మొత్తం తతంగం నడిపినట్లు తెలిసింది.


Similar News