విద్యార్థిని ఆరోగ్యం పై పట్టింపు లేదా

విద్యార్థిని ఆరోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు.

Update: 2024-11-24 11:13 GMT

దిశ, వాంకిడి : విద్యార్థిని ఆరోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థిని శైలజను ఆదివారం ఆమె పరామర్శించారు.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఫుడ్ పాయిజన్ తో 20 రోజుల నుంచి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శైలజ ఆరోగ్యం నేటికీ అదుపులోకి రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిని ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినాప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం వైద్యులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి విద్యార్థిని ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. 


Similar News