సన్న రకం వరికి బోనస్ ఇస్తున్నాం.. మాజీ జెడ్పీటీసీ

ప్రభుత్వం కొనుగోలు చేసే సన్న రకం వరికి మద్దతు ధర రూ.500 బోనస్ చెల్లిస్తామని మాజీ జెడ్పీటీసీ రుద్రపట్ల సంతోష్ కుమార్ అన్నారు.

Update: 2024-11-25 12:19 GMT

దిశ, వేమనపల్లి : ప్రభుత్వం కొనుగోలు చేసే సన్న రకం వరికి మద్దతు ధర రూ.500 బోనస్ చెల్లిస్తామని మాజీ జెడ్పీటీసీ రుద్రపట్ల సంతోష్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లెడ, సూరారం, నాగారం, కొత్తపల్లి, మంగనపల్లి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను పీఎసీఎస్ చైర్మన్ కుబిడే వెంకటేశం, సీఈఓ మచ్చ మధుకర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం ఏ గ్రేడ్ వడ్లకు 2320 మద్దతు ధర, అలాగే రూ.500 బోనస్, ఇతర వడ్లకు 2300 రూపాయలు మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు అమ్ముకొని మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాబీర్ అలీ, మాజీ వైస్ ఎంపీపీ ఆత్రం గణపతి, మాజీ సర్పంచులు కొరకోప్పుల మధుకర్ గౌడ్, గాలి మధు, నికాడి భగవంతు కాంగ్రెస్ నాయకులు ముల్కల్ల సత్యనారాయణ, మధుసూదన్, చీర్ల దామోదర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అయిల్ల శ్రీనివాస్ రెడ్డి, అన్నారపు శంకర్, పెరుగు దాసు, వరి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చీర్ల సమ్మిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.


Similar News