'టీబీజీకేఎస్, ఏఐటీయూసీల బారి నుండి సింగరేణిని కాపాడండి'

టీబీజీకేఎస్, ఏఐటీయూసీ యూనియన్ల బారి నుండి సింగరేణిని కాపాడాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు.

Update: 2023-12-26 10:19 GMT

దిశ, నస్పూర్ : టీబీజీకేఎస్, ఏఐటీయూసీ యూనియన్ల బారి నుండి సింగరేణిని కాపాడాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. మంగళవారం నస్పూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికుల ప్రయోజనాలను కాలరాసి అధికారం కోసం సింగరేణి ఎన్నికలలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ ఒక్కటి అయ్యాయని ఆరోపించారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగిన చరిత్ర ఆ రెండు యూనియన్లకే దక్కుతుందన్నారు. సింగరేణిని కాపాడే శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయని అన్నారు. యువ కార్మికుల చేతిలోనే సింగరేణి భవిష్యత్తు ఉందని తెలిపారు. శ్రీరాంపూర్ ఓసీపీ లో పనిచేస్తున్న ఇతరులను తొలగించి స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కార్మికులందరికీ 250 గజాల స్థలం, 20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామని, అలవెన్సుల ఆదాయం పై ఇన్కమ్ టాక్స్ యాజమాన్యం చే కట్టిస్తామని తెలిపారు. మహిళ ఉద్యోగులను అండర్ గ్రౌండ్ లో దింపకుండా సర్ఫేస్ బదిలీ వర్కర్ డెసిగ్నేషన్ కల్పిస్తామని తెలియజేశారు. కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో చెల్లిస్తున్నట్లుగా సింగరేణిలో కూడా హైపర్ కమిటీ వేతనాలు చెల్లిస్తామని, సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల ఉద్యోగ భద్రత, ఆర్థిక ఎదుగుదల, హక్కుల కొరకు పోరాడే ఐఎన్టీయూసీని ఆదరించాలని, రానున్న సింగరేణి ఎన్నికలలో గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీయూసీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నెలలో రెండు, నాల్గవ ఆదివారాల్లో అన్ని విభాగాల కార్మికులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. నస్పూర్ ప్రజలకు రుణపడి ఉంటానని మీ రుణం తీసుకునే అవకాశం ఇవ్వండని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు కలవేన శ్యామ్, కాంగ్రెస్ నాయకులు పూదరి తిరుపతి, తూముల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News