రోడ్డెక్కిన బడి పిల్లలు.. వి వాంట్ టీచర్స్ అంటూ నినాదాలు

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిఘ్వా గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పిల్లలు టీచర్లు కావాలంటూ నిరసన చేస్తూ మంగళవారం రోడ్డెక్కారు. వి వాంట్ టీచర్స్

Update: 2022-11-22 06:43 GMT

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిఘ్వా గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పిల్లలు టీచర్లు కావాలంటూ నిరసన చేస్తూ మంగళవారం రోడ్డెక్కారు. వి వాంట్ టీచర్స్ అంటూ నినాదాలు చేస్తూ, రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి తమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని తెలియపరిచారు. సాధారణంగా ప్రతి 25 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా, నిగ్వా ప్రభుత్వ ప్రాథమిక,ఉన్నత పాఠశాలలో కలిపి దాదాపు 200 మంది విద్యార్థులు ఉండగా సరిపడినటువంటి ఉపాధ్యాయులు లేరు.

ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్న తరుణంలో ఇప్పటికీ తెలుగు,బయో సైన్స్ సబ్జెక్టులకు టీచర్స్ లేకపోవడంతో విద్యార్థులు మేము నేర్చుకునేది ఎలా, పాస్ అయ్యేది ఎలా అంటూ విద్యా వ్యవస్థపై మండిపడుతున్నారు. అటువైపుగా వెళ్తున్న నిర్మల్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ పిల్లలకు మద్దతు తెలియజేశారు. ప్రభుత్వ విధానాలపై,ఇప్పటికీ అవసరమున్న చోట్లలో టీచర్ రిక్రూట్మెంట్ చేయకపోవడం, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడమే అంటూ మండిపడ్డారు.


Similar News