బంద్ ను భగ్నం చేసిన పోలీసులు..

సాగునీటి కోసం కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల జిల్లాలో గురువారం చేపట్టిన సంఘీభావ బంద్ ను పోలీసులు భగ్నం చేశారు.

Update: 2023-03-02 12:30 GMT

దిశ, మంచిర్యాల టౌన్ : సాగునీటి కోసం కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల జిల్లాలో గురువారం చేపట్టిన సంఘీభావ బంద్ ను పోలీసులు భగ్నం చేశారు. కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీటిని అందించి పంటలను కాపాడాలని జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గత మూడు రోజులుగా కొనసాగుతోంది. ఈ దీక్షకు సంఘీభావంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. కాగా, బంద్ లో భాగంగా ర్యాలీ తీస్తున్న కాంగ్రెస్ నాయకులను మంచిర్యాల, లక్షెట్టిపేటలో పోలీసులు అడ్డుకున్నారు.

ఆ పట్టణాల్లో పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. కాగా, మంచిర్యాలలో ర్యాలీలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖను ఆమె నివాసానికి తరలించి హౌజ్ అరెస్ట్ చేశారు. శాంతియుతంగా బంద్ సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడమేమిటని ఆమె ప్రశ్నించారు. కడెం చివరి ఆయకట్టు పంటలకు సాగునీరు అందించే వరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Tags:    

Similar News