ఆ గ్రామ ప్రజాప్రతినిధులకు జాతీయ అవార్డులు..

గ్రామపంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, సేవలకుగాను కేంద్రప్రభుత్వం వివిధ విభాగాల్లో ఉత్తమ పురస్కారాలు అందజేసింది.

Update: 2023-03-24 10:44 GMT

దిశ, సారంగాపూర్ : గ్రామపంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, సేవలకుగాను కేంద్రప్రభుత్వం వివిధ విభాగాల్లో ఉత్తమ పురస్కారాలు అందజేసింది. గ్రామపంచాయతీల్లో చేపట్టిన వివిధ పనులు, సేవల పై ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు పంపించగా పోస్టల్‌ ద్వారా పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పేరిట పురస్కారాలు ప్రశంసాపత్రాలను పంపించింది. ఈ మేరకు శుక్రవారం సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీలు పురస్కారాలను అందుకున్నారు. ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన సర్పంచులు, కార్యదర్శులకు పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాలను అందజేశారు.

మండలంలోని 32 గ్రామపంచాయతీలకు 19 గ్రామ పంచాయతీలకు ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు లభించాయి. రావడంతో ఆయా గ్రామసర్పంచులు ప్రజాప్రతినిధులు అభినందించారు. ఆయా విభాగాల్లో (వ్యక్తిగత) పురస్కారాలు లభించగా.. సర్పంచులతో పాటు, కార్యదర్శులను జెడ్పీటీసీ, ఎంపీపీలు శాలువలతో సన్మానించి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ పతానీ రాధా, మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్, ఎంపీడీవో సరోజ, ఎంపీఓ తిరుపతిరెడ్డి, ఏపీఓ లక్ష్మారెడ్డి, 32 గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags:    

Similar News