వర్షాల పట్ల అధికారులు అప్రమత్తం ఉండాలి : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తం
దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తం ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. కంట్రోల్ రూం పనిచేస్తున్న అధికారుల పనితీరును పరిశీలించారు. కంట్రోల్ రూం కు సమాచారం అందిన వెంటనే సంబంధిత మండలాల అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. జిల్లాలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. వీరి వెంట జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు డీఎస్పీ సదయ్య ఉన్నారు.