పూచీకత్తు చెల్లించలేని ఖైదీల సమాచారం వారి కుటుంబాలతో చర్చించాలి

జైలు జీవితం గడుపుతూ బెయిల్ పొందే అర్హత ఉన్న ఖైదీలు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారి సమాచారాన్ని సేకరించి వారి కుటుంబ సభ్యులకు తెలుపాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు.

Update: 2024-10-29 14:32 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్ : జైలు జీవితం గడుపుతూ బెయిల్ పొందే అర్హత ఉన్న ఖైదీలు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారి సమాచారాన్ని సేకరించి వారి కుటుంబ సభ్యులకు తెలుపాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా ఎంపవర్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని జైళ్ళలో వివిధ కేసుల్లో శిక్షణ అనుభవిస్తూ, బెయిల్ పొందడానికి అర్హత ఉన్నప్పటికీ, బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు చెల్లించే ఆర్థిక స్తోమత లేని ఖైదీల కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా ఎంపవర్డ్మెంట్ కమిటీ సెక్రటరీ జి.రాధిక, డీఎస్పీ గంగారెడ్డి, జిల్లా జైలు సూపరిండెంట్ సిహెచ్ చిరంజీవి, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Similar News