జిల్లాలో మొదటి స్థానంలో ముధోల్ మండల సమాఖ్య..
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధువారం మండల కేంద్రమైన ముధోల్ లోని సరస్వతి మండల సమాఖ్య (ఎమ్ఎస్) స్త్రీ నిధిలో నిర్మల్ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది.
దిశ, ముధోల్ : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధువారం మండల కేంద్రమైన ముధోల్ లోని సరస్వతి మండల సమాఖ్య (ఎమ్ఎస్) స్త్రీ నిధిలో నిర్మల్ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి చేతుల మీదుగా ఏపీఎం అశోక్, మండల సమాఖ్య సభ్యులు అవార్డును తీసుకున్నారు. అదేవిధంగా ముధోల్ క్లస్టర్ సీసీ గోదావరి, వివోఏ ఫాతిమా బేగం ఉత్తమ అవార్డులను తీసుకున్నారు.
2022 - 23 సంవత్సరానికిగాను బ్యాంకు లింకేజీలో 706 ఎస్హెచ్ జీలకు రూ. 2625.89 కోట్లకు, 433 ఎస్హెచ్ జీలకు రూ. 2626.84 కోటి 100% ఇచ్చారు. అదేవిధంగా స్త్రీ నిధిలో రూ.526.35 కోటిగాను, 649.0 కోటి, 123.41%గా ఉంది. నిర్దేశించిన లక్ష్యానికి మించి రుణాల చెల్లింపులు, రికవరీలు సాధించారు. జిల్లా స్థాయిలో మండలసమాఖ్య మొదటి స్థానంలో నిలవడంతో మహిళా సంఘాల సభ్యులు, స్థానికులు అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.