నైతిక విజయం జోగు రామన్నదే

గడిచిన ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ నైతిక విజయం బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నదేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

Update: 2024-09-20 16:19 GMT

దిశ, ఆదిలాబాద్ : గడిచిన ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ నైతిక విజయం బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నదేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్​లోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాజీ మంత్రి జోగు రామన్న మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా రాజకీయ పరిస్థితులను చర్చించారు.

    కేసీఆర్ సారథ్యంలో మంత్రిగా పనిచేయడం గర్వంగా ఉందన్నారు. కాగా ఆదిలాబాద్ లో జోగు రామన్న ఓటమిపై కేసీఆర్ మాట్లాడుతూ నైతికంగా జోగు రామన్నది ఓటమి కాదని, రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటామన్నారు. రానున్న ఎలాంటి ఎన్నికలైనా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని, తిరిగి జోగు రామన్న విజయం ఖాయం అవుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలని రామన్నకు కేసీఆర్​ సూచించారు.  

Tags:    

Similar News