కాంగ్రెస్ హయాంలోనే సంక్షేమం, అభివృద్ధి..

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమానికి బీజం పడిందని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.

Update: 2023-03-14 11:41 GMT

దిశ, నస్పూర్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమానికి బీజం పడిందని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మంగళవారం హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కౌన్సిలర్, పట్టణ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు బొద్దున సంధ్యారాణి రామ్మూర్తి ఆధ్వర్యంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాదయాత్ర చేపట్టారు.

ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ మంచి రోజులు వస్తాయని సురేఖ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, నాయకులు కృష్ణారావు, రామకృష్ణ, చంద్రశేఖర్, డాక్టర్ సతీష్, సదానందం, ముదాం శంకర్, వెంకటేష్, స్వర్ణ, నరసమ్మ, లక్ష్మి, హరీష్, సమ్ములు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News