నెరవేరిన "మైదం" అభిమానుల చిరకాల వాంఛ..
బడుగు, బలహీన వర్గాల, మండల ప్రజల మన్ననలు పొంది మూడుసార్లు మండల అధ్యక్షుడిగా ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్, సర్పంచ్ గా పదవులుపొంది నిత్యం పేదప్రజల అభివృద్ధికి కృషిచేసిన స్వర్గీయ మైదం సత్యనారాయణ అభిమానుల చిరకాల వాంఛ నెరవేరిందనీ ఆయన అభిమానులు తెలిపారు.
దిశ, చెన్నూర్ : బడుగు, బలహీన వర్గాల, మండల ప్రజల మన్ననలు పొంది మూడుసార్లు మండల అధ్యక్షుడిగా ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్, సర్పంచ్ గా పదవులుపొంది నిత్యం పేదప్రజల అభివృద్ధికి కృషిచేసిన స్వర్గీయ మైదం సత్యనారాయణ అభిమానుల చిరకాల వాంఛ నెరవేరిందనీ ఆయన అభిమానులు తెలిపారు. రాష్ట్రంలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ అంబ అగస్తేశ్వర స్వామి ఆలయానికి అనుకొని ఉన్న పెద్దచెరువు నడిబొడ్డున శివాలయాన్ని తన సొంత ఖర్చులు 35 లక్షల వెచ్చించి నిర్మించారు. అంతేకాకుండా పెద్ద చెరువుకట్ట పైన పార్కు ఏర్పాటుచేసి పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలన్న ఆయన కోరిక నెరవేరకుండానే మృతి చెందడంతో ఆయన అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
చాలా తక్కువ సమయంలోనే చెన్నూరు చెరువుకట్ట శివాలయం ఎంతో ప్రసిద్ధి చెంది నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండేది. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆలయం, పార్కు పూర్తి కాకుండానే ఆయన మృతి చెందారు. ఆ సమయంలో పదవిలో ఉన్ననాయకులను సంప్రదించగా ఎవరు పట్టించుకోలేదని మృతిచెందిన అనంతరం ఆలయాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో చెత్తాచెదారంతో నిండి ఆలయం చుట్టూ దుర్గంధం వెదజల్లడంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. ఆయన అనుకున్న విధంగా చెరువు కట్ట పైన పార్కు నిర్మించకుండానే మృతి చెందడంతో ఆయన అభిమానులు దిక్కుతోచని పరిస్థితులలో ఉన్న సందర్భంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ పెద్ద చెరువు ప్రాంతాన్ని మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్ది హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి సుందరీకరణంగా తయారు చేయడంతో తమ నాయకుడు అనుకున్న కల నెరవేరిందని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.