ఆమెను పదవి నుంచి తొలగించకపోతే ఉట్నూర్ సంఘటనే పునరావృతం అవుతుంది..

నిర్మల్ జిల్లా కేంద్రంలో అక్రమంగా ఎస్టీ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి నిర్మల్ డీపీఆర్ఓ ఉద్యోగం చేస్తున్న బాదం తిరుమలను వెంటనే తొలగించకుంటే గతంలో ఉట్నూర్ లో జరిగిన సంఘటన నిర్మల్ లో కూడా పునరావృతం చేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు తుడుం దెబ్బ గోడం గణేష్ హెచ్చరించారు.

Update: 2023-03-25 16:46 GMT

దిశ, నిర్మల్ రూరల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో అక్రమంగా ఎస్టీ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి నిర్మల్ డీపీఆర్ఓ ఉద్యోగం చేస్తున్న బాదం తిరుమలను వెంటనే తొలగించకుంటే గతంలో ఉట్నూర్ లో జరిగిన సంఘటన నిర్మల్ లో కూడా పునరావృతం చేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు తుడుం దెబ్బ గోడం గణేష్ హెచ్చరించారు. గతంలో ఆమెపై కలెక్టర్ కి ఫిర్యాదు చేసినప్పటికీ నెలరోజుల నుంచి ఇంకా దొంగ సర్టిఫికెట్ ను ఇస్తూ ఉద్యోగం చేస్తుందని జిల్లా కలెక్టర్ కి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆధారాలతోసహా సమర్పించిన స్పందించకపోవడం ఆదివాసుల ఆగ్రహానికి పరీక్ష పెడుతున్నట్లు అనిపిస్తోందని అన్నారు. ఒకవేళ సహనం కోల్పోతే తుడుందెబ్బ ఆధ్వర్యంలో రానున్నరోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలకి అధికారులు బాధ్యులు కాకతప్పదన్నారు.

మళ్ళీ శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసులను అనగదొక్కేందుకు వలస లంబాడాలు కుట్ర పన్నుతున్నారని వారికి వత్తాసు పలికితే సహించేది లేదని, వారం రోజులోపు డీపీఆర్ఓ తిరుమలను వెంటనే విధులనుండి తొలగించాలని లేదంటే నిర్మల్ కలెక్టరేట్ ను ఉమ్మడి జిల్లా ఆదివాసుల ఆధ్వర్యంలో ముట్టాడి చేస్తాం పేర్కొన్నారు. నిర్మల్ విద్యాధికారి మంచిర్యాలలో స్కూల్ సర్టిఫికెట్ను పరిశీలిస్తే బీసీ పద్మశాలి తెలిసిన కూడా అధికారులు చర్యతీసుకోకపోవడం తొలగించకపోవడం వెనక మర్మమేంటని ప్రశ్నిస్తున్నామన్నారు.

జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా జిల్లా నుండి తిరుమలను సాగనంపాలని లేదంటే ఉట్నూర్ ఐటీడీఏ ముట్టడిలో ఏది జరిగిందో నిర్మల్ కలెక్టరేట్లో అదే జరగబోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజీవ్, వెంకగారి భూమయ్య, జిల్లా అధ్యక్షులు సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు, పెందూరు పుష్ప రాణి, మాధవ్, బొసాని రాజేశ్వర్, వెంకగారి నరసయ్య, గోవర్ధన్, పొన్కల్ భీమేష్, బోరిగాం సర్పంచ్ భీమయ్య, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News