వంటశాలలో చేతబడి ముగ్గులు.. భయభ్రాంతుకు గురైన విద్యార్థులు, సిబ్బంది..
కొంతమంది ఆకతాయిలు ఓ పాఠశాల విద్యార్ధులను, మధ్యాహ్న భోజన కార్మికులను భయభ్రాంతులకు గురిచేద్దామనుకున్నారు.
దిశ, మామడ : కొంతమంది ఆకతాయిలు ఓ పాఠశాల విద్యార్ధులను, మధ్యాహ్న భోజన కార్మికులను భయభ్రాంతులకు గురిచేద్దామనుకున్నారు. అందుకుకోసం పాఠశాలలోని వంటశాలలో ఉన్న వంటసామాగ్రిని ముగ్గురూపంలో వేశారు. ఈ సంఘటన మండలంలోని పొనకల్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే రెండు రోజుల క్రితం హోలీ పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవులు వచ్చాయి.
ఇదే అదునుగా అనుకున్న ఎవరో ఆకతాయిలు ఈ ఆటలు ఆడినట్లు కనిపిస్తుంది. వంటగది తలుపులను కాలుతో తన్ని లోపలికి ప్రవేశించి అందులో ఉన్న సామాగ్రితో పసుపు, కారం, పల్లీలు, ఆవాలు, ఉల్లిగడ్డలతో ముగ్గురూపంలో వేశారు. ఇలాంటి సంఘటన ఈ పాఠశాలలో రెండుసార్లు జరిగినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయాలన్న సంకల్పంతో ఈ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది.