ఆ బస్సులు భద్రమేనా..?.. అధికారులు పట్టించుకునేనా..?
రెండేళ్ల కరోనా ఆటంకం తర్వాత, ఎట్టకేలకు స్కూళ్లు స్టార్ట్ అయ్యాయి. పిల్లలు కూడా హుషారుగా వెళ్తున్నారు.
దిశ, జన్నారం : రెండేళ్ల కరోనా ఆటంకం తర్వాత, ఎట్టకేలకు స్కూళ్లు స్టార్ట్ అయ్యాయి. పిల్లలు కూడా హుషారుగా వెళ్తున్నారు. కానీ, తల్లిదండ్రులు మాత్రం కంగారు పడుతున్నారు. మరి పేరేంట్స్ ఆందోళనకు కారణం ఏంటీ ? అంటే స్కూల్ బస్సులను చూపుతున్నారు. మండలంలోని ప్రైవేటు పాఠశాలల యాజమానులు మాత్రం సీటింగ్ కేపాసిటికి మించి విద్యార్థులను సీట్ల మద్యలో, డ్రైవర్ వద్ద నిలుబడి తరలిస్తన్నారు.
ఒక బస్సు రెండు, మూడు ట్రిప్పులు రోజు వేస్తుంది. దీని ద్వారా సరైన సమయానికి విద్యార్థులను చేరవేయాలని బస్సులను అతివేగంగా నడుపుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం, చిన్నారుల బంగారు భవిష్యత్తును, బస్సు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం దానికి అనేక కారణాలున్నాయి. బస్సుల ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ గడువు ముగియడం, ఫిట్‌నెస్ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే తల్లిదండ్రుల్లో భయం పెరుగుతోంది.
మండలంలోని కొన్ని పాఠశాలల బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారు. బస్సుల్లో సీట్లు, అద్దాలు, టైర్లు అన్ని సక్రమంగా లేకున్న బస్సులను నడుపుతున్నారు. రవాణ శాఖ అధికారులు దీనిపై ఫోకస్ పెట్టి, స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఫిట్‌నేస్ లేని బస్సులు రోడ్డెక్కుతుండటంతో, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్టీఏ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, చిన్నారుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.