కడం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు భారీగా వరద .. 10 గేట్లు ఎత్తివేత

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు భాగంగా నిర్మల్ జిల్లాలో శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్ట్ లు నిండుకుండల్లా మారిపోయాయి.

Update: 2024-09-01 07:30 GMT

దిశ, ఖానాపూర్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు భాగంగా నిర్మల్ జిల్లాలో శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్ట్ లు నిండుకుండల్లా మారిపోయాయి. దీంతో జిల్లాలోని కడం నారాయణరెడ్డి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరుతుంది. వెంటనే అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు ఆదివారం ఉదయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 7.195 క్యూసెక్కుల,700 అడుగులు కాగా ప్రస్తుతం డ్యాంలో 7.603 టీఎంసీ లు ఉండగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతుంది. ఇన్ ఫ్లో 61001 క్యూసెక్కుల చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 6.414 టీఎంసీలుగా ఉంది. పది గేట్ల ద్వారా వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. దీంతో గోదావరి నది తీర ప్రాంతంలో పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, రైతులు వెళ్లకూడదని, నీటిపారుదల శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రాజెక్టు చేరుతున్న వరద నీటి ఉధృతిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.


Similar News