Dandari : వైభవంగా దండారి ఉత్సవాలు

ఆదివాసీ గ్రామాల్లో భోగి పూజలతో ప్రారంభమైన దండారి ( Dandari)ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

Update: 2024-10-27 11:48 GMT

దిశ, ఇంద్రవెల్లి : ఆదివాసీ గ్రామాల్లో భోగి పూజలతో ప్రారంభమైన దండారి (Dandari)ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివాసీలు భక్తి శ్రద్దలతో ఏత్మ సూర్ దేవతలను (Etma Sur gods) కొలుస్తూ పూజలు చేయడంతో పాటు కోలాటం, గుస్సాడీ నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇతర గ్రామాల దండరిలను తమ గ్రామాలకు అతిథులుగా ఆహ్వానించి మర్యాదలు చేస్తున్నారు.

     ఆదివారం మండలంలోని డొంగర్ గావ్ గ్రామానికి సాలేగుడ గ్రామ దండారి బృందం అతిథులుగా వెళ్లి మర్యాదలు స్వీకరించారు. ఈ మేరకు సంప్రదాయ వాయిద్యాల మధ్య గుస్సాడిలు, యువకులు, మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ దండారి ఉత్సవాలు దీపావళి పండుగ పూర్తయ్యాక మరుసటి రోజు కోలబోడి పూజలతో ముగియనున్నాయి.  

Tags:    

Similar News