Sp:ఆదివాసుల అభివృద్ధిలో కనకరాజు పాత్ర కీలకం

ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలలో ముఖ్యభాగమైన గుస్సాడి నృత్యాన్ని అభివృద్ధి చేసి మరొక తరానికి అందించిన గొప్ప వ్యక్తి కనకరాజు (Kanakaraju)అని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు (SP DV Srinivasa Rao)అన్నారు.

Update: 2024-10-26 11:26 GMT

దిశ, జైనూర్ : ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలలో ముఖ్యభాగమైన గుస్సాడి నృత్యాన్ని అభివృద్ధి చేసి మరొక తరానికి అందించిన గొప్ప వ్యక్తి కనకరాజు (Kanakaraju)అని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు (SP DV Srinivasa Rao)అన్నారు. శనివారం జైనూర్ మండలంలోని మర్లావాయి గ్రామంలో కనకరాజు అంత్యక్రియలు నిర్వహించారు.

     ఈ కార్యక్రమానికి ఎస్పీ హాజరై నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుస్సాడి నృత్య అభివృద్ధిలో కనకరాజు చేసిన కృషికిగాను ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ పురస్కారం (Padma Shri award)అందించినట్టు తెలిపారు. అందుకే కనకరాజు అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించినట్టు చెప్పారు.  

Tags:    

Similar News