Kanakaraju : పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు మృతి...
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైన్నూర్ మండలంలోని మర్లవాయి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ( Padma Shri Award) , గుస్సాడీ ( Gussadi) నృత్య కళాకారుడు కనకరాజు ( Kanakaraju ) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు.
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైన్నూర్ మండలంలోని మర్లవాయి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ( Padma Shri Award) , గుస్సాడీ ( Gussadi) నృత్య కళాకారుడు కనకరాజు ( Kanakaraju ) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, నేర్పుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనకరాజుకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని 2021 నవంబరు 9న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) చేతుల మీదుగా అందించారు. శనివారం మధ్యాహ్నం మార్లావాయి గ్రామంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు స్థానిక గ్రామస్థులు తెలిపారు.