Pranahita river : గల్లంతైన యువకుల కోసం గజ ఈతగాళ్లలో వెతికించండి

బెజ్జుర్ మండలం సోమిని ఎర్రబండ (Somini errabanda)ప్రాంతంలో ఈతకు వెళ్లి యువకులు గల్లంతైన ప్రాంతాన్ని ఎమ్మెల్సీ దండే విఠల్ పరిశీలించారు.

Update: 2024-10-27 09:27 GMT

దిశ, బెజ్జూర్ : బెజ్జుర్ మండలం సోమిని ఎర్రబండ (Somini errabanda)ప్రాంతంలో ఈతకు వెళ్లి యువకులు గల్లంతైన ప్రాంతాన్ని ఎమ్మెల్సీ దండే విఠల్ పరిశీలించారు. ముగ్గురు యువకుల్లో ఒకరైన జాహీర్ మృతదేహం తలాయి ప్రాంతంలో లభ్యంకాగా మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లతో వెతికించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆదివారం బెజ్జూరు మండలం సోమిని ప్రాణహిత రేవు(Pranahita Revu)ను ఆయన పరిశీలించారు.

    ప్రమాదానికి గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రాణహితలో గల్లంతైన ముగ్గురు యువకుల కుటుంబాలను ఆయన పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట బెజ్జూర్ మండల తాజా మాజీ జెడ్పీటీసీ పంద్రం పుస్పలత, చింతలమనేపల్లి తాజా మాజీ ఎంపీపీ డబ్బుల నానయ్య, టీపీసీసీ సభ్యులు ఆర్షద్ హుస్సేన్, పీఏసీఎస్ చైర్మన్ కుర్సింగా ఓం ప్రకాశ్, డైరెక్టర్ రాచకొండ శ్రీ వర్దన్, నాయకులు నహీర్ అలీ, రేణుకుంట్ల పెంటయ్య, రంగు సురేష్ గౌడ్, ఇగురపు వెంకటి, సంజీవ్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News