SI Sandeep : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.. ఎస్సై సందీప్

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే సమాజసేవలో ముందుండాలని ఎస్ఐ సందీప్ ( SI Sandeep ) అన్నారు.

Update: 2024-10-28 07:27 GMT

దిశ, మామడ : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే సమాజసేవలో ముందుండాలని ఎస్ఐ సందీప్ ( SI Sandeep ) అన్నారు. సోమవారం మండలంలోని జయరాం తండా గ్రామంలో డ్రగ్స్, గుడుంబా, గంజాయి తదితర వాటి పై గ్రామస్తులకు అవగాహన ( Police Awareness ) కల్పించారు. మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను గురించి వివరించారు. గ్రామంలో, ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. దీంతో ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News