గూడెం లిఫ్ట్ ఆయకట్టుకు సాగునీరందించడంలో ప్రభుత్వం విఫలం..
గూడెం గోదావరి లిఫ్ట్ ఆయకట్టు భూములకు సాగు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు అన్నారు.
దిశ, లక్షెట్టిపేట : గూడెం గోదావరి లిఫ్ట్ ఆయకట్టు భూములకు సాగు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు అన్నారు. ఆదివారం మండలంలోని కొత్తూరు గ్రామంలో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. లీకేజీలతో ఇబ్బందులు పెడుతున్న లిఫ్ట్ పైప్ లైన్ల స్థానంలో కొత్త పైప్ లైన్ వేస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యపు ధోరణి వల్లే పైప్ లైన్ మార్పు పనులు జరగడం లేదని ఆరోపించారు. సాగు నీరందక ఎండిపోయిన పంట పొలాల రైతులకు నష్టపరిహారం అంద జేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హేమంత్ రెడ్డి, సతీష్, గంగన్న శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.