పల్లె జనాల్లో గొలుసు దొంగతనాల భయం..!

Update: 2024-08-30 09:05 GMT

దిశ, కుబీర్ : బైంసా పట్టణంలో జరుగుతున్న వరుస గొలుసు దొంగతనాల సంఘటనలను చూసి పల్లెజనాలు జంకుతున్నారు. కుబీర్ మండలంతోపాటుగా, నియోజకవర్గలోని పల్లె జనాల్లో భయం నెలకొంది. జనసంచారం అడుగడుగునా నిగా నేత్రాలతో, పటిష్ట పోలీసు వ్యవస్థ ఉన్న పట్టణ ప్రాంతంలోనే వరుసగా చైన్ స్నేకర్లు రెచ్చిపోతున్నారు. పల్లెలు, మారుమూల గ్రామాలు, గిరిజన తండాళ్ళోను ఇదేచర్చ జరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఉదయం అధికంగా వ్యవసాయ పనులకు వెళ్తారు. కొత్త వ్యక్తులు మహిళలైనా, పురుషులైనా, గ్రామాల్లో బిచ్చం అడగడానికి వచ్చిన, బట్టలు, మిక్సర్లు,కుక్కర్లు, ఇతరాత్ర వస్తువుల విక్రయల నిమిత్తం వచ్చిన వారిని చూసి భయాందోళనకు గురవుతున్నారు. పరిసర ప్రాంతాల్లో జనసంచారం తక్కువగా ఉంటుంది. విక్రయాలు జరిపే వారు తక్కువ ధరకు అమ్ముతామంటూ నేరుగా ఇళ్లల్లోకి వస్తుండడంతో మహిళలు భయపడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు, గ్రామాల్లోని యువత, కొత్త వ్యక్తుల కదలికలను కనిపెడుతూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Similar News