బస్తీ దవఖానాల్లో మహిళా ఆరోగ్య క్లినిక్..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని హమాలివాడలో ఉన్న బస్తీ దవఖానలో మహిళా ఆరోగ్య క్లినిక్ ను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, కలెక్టర్ బాధవత్ సంతోష్ లు బుధవారం ప్రారంభించారు.

Update: 2023-03-08 11:41 GMT

దిశ, మంచిర్యాల టౌన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని హమాలివాడలో ఉన్న బస్తీ దవఖానలో మహిళా ఆరోగ్య క్లినిక్ ను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, కలెక్టర్ బాధవత్ సంతోష్ లు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రప్రభుత్వం మహిళలకు తీపికబురు అందించిందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతిమహిళా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్ సీ, యూహెచ్ సీ, బస్తి దవాఖానాల్లో ప్రత్యేక క్లినిక్ లను మహిళల కోసం ఏర్పాటుచేశారన్నారు.

ఈ ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు 57 రకాల టెస్టులు చేసి 24 గంటలలోనే రిపోర్టులు అందిస్తారని తెలియజేశారు. వైద్యపరీక్షలను ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్ చేస్తారని జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు కూడా ఉంటాయని తెలిపారు. రాబోయే రోజుల్లో దీన్నివిస్తరింప చేసే విధంగ ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ప్రతిఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యఅధికారి జి.సి.సుబ్బారాయుడు, డాక్టర్స్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News