వెంటిలేటర్ పై ప్రజాస్వామ్యం..

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇయ్యాల సమస్యల పై ప్రశ్నిస్తే పాలకులు మన గొంతు నొక్కుతున్నారని సుప్రీం కోర్టు న్యాయవాది పీ. నిరుప్ అన్నారు.

Update: 2023-03-05 14:27 GMT

దిశ, మంచిర్యాల టౌన్ : కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇయ్యాల సమస్యల పై ప్రశ్నిస్తే పాలకులు మన గొంతు నొక్కుతున్నారని సుప్రీం కోర్టు న్యాయవాది పీ. నిరుప్ అన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణ జన్మభూమి నగర్ లోని చార్వాక హాల్ లో "వెంటి లేటర్ పై ప్రజాసౌమ్యం" అనే అంశం పై ఏర్పాటు చేసిన ప్రజాస్వామిక వాదులు సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్ర పాలనలో జరిగిన అవమానాలే ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నాయన్నారు. ఇంటికి ఒక ఉద్యమం ఏమైంది, నీళ్ళు, నిధులు, నియామకాలు ఎటు పోయాయని ప్రశ్నించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు నదులతో పాటు అనేక జలపాతాలు అటవీ సంపద ఉన్నపటికీ తాగు నీటికి తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. తాజాగా గోదావరి నీళ్ళు మహారాష్ట్ర కు తరలించడానికి కేసీఆర్ పథకాలు రూపొందిస్తున్నాడని, జిల్లాలో అనేక ఖనిజ వనరులు ఉన్న రాష్ట్రం ఏర్పడి ఎనిమిది ఏళ్లు గడిచినా జిల్లా ప్రజలు కనీస సదుపాయాలు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల సాధన కొరకై ప్రజాస్వామిక వాదులు ఏకం కావాల్సి ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, బీసీ సంఘం రాష్ట్రనాయకుడు, డా.నీలకంటేశ్వర్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్, అన్వర్ పటేల్ పలువురు ప్రజాస్వామిక వాదులు పాల్గొన్నారు.

Tags:    

Similar News