అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తుందని ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు.
దిశ, ఉట్నూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తుందని ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఐటీడీఏ కార్యాలయం ముందు సీఆర్టీలు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా ఆయనతో పాటుగా మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, మాజీ ఎంపీపీ పంద్రా జైవంత్ రావ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న సీఆర్టీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా నెల రోజుల లోపలనే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు..
గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన వెంటనే సీఆర్టీలను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీఆర్టీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అనంతరం సీఆర్టీల సమ్మెకు విరాళంగా రూ.50 వేలను అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సలీమోద్దీన్, రమేష్, వెంకటేష్, మహేందర్, బాబా శ్యామ్, సొనే రావు, సత్తన్న దినేష్, శ్రీకాంత్, సాజిద్, పొన్నం సాయి కుమార్, సయ్యద్ ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.