బీజేపీ ఆరోపణలను ఖండించిన తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న నేపథ్యంలో, రెండు పడకల గదులను ఇల్లు లేని నిరుపేదలకు అందించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తుంటే బీజేపీ నాయకులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు.

Update: 2023-03-06 17:20 GMT

దిశ, రామకృష్ణాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న నేపథ్యంలో, రెండు పడకల గదులను ఇల్లు లేని నిరుపేదలకు అందించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తుంటే బీజేపీ నాయకులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు తనపై చేసిన ఆరోపణలను ఘాటుగా విమర్శించారు.

తన పాఠశాలలో పనిచేస్తున్న వివిధ కాలనీలకు చెందిన 27 మంది డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో అర్హులైన ఆరుగురికి మాత్రమే రెండు పడకల గదుల అర్హుల కమిటీలో పేర్లు వచ్చాయని అన్నారు. అందులో ఇద్దరు ఆయాలు వితంతువులని, మిగిలిన వారు పేద కుటుంబలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. తన పాఠశాల అభివృద్ధిని ఓర్వలేని కొందరు భాజాపా నాయకులు మైకులముందు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకుల తప్పుడు ఆరోపణలకు ప్రజలే బుద్ధి చెబుతారని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News