మోడీ సర్కార్ సామాన్యుడి పై మరింత భారం మోపుతుంది : ఎమ్మెల్యే దివాకర్ రావు
వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం లక్షెట్టిపేటలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద ఖాళీ సిలిండర్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
దిశ, లక్షెట్టిపేట : వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం లక్షెట్టిపేటలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద ఖాళీ సిలిండర్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చౌరస్తా వద్ద జాతీయ రహదారి పై కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ సామాన్యుడి పై మరింత భారం మోపే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడ్డారు.
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, నాయకులు చుంచు చిన్నయ్య, పాదం శ్రీనివాస్, తిరుపతి, శ్రీకాంత్, కిషన్, రమేష్, రాజన్న, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.