బండి సంజయ్ ను సస్పెండ్ చేయాలి.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం హర్షణీయం కాదని, అతని వ్యాఖ్యలు ఎంత సమంజసమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు.

Update: 2023-03-12 11:49 GMT

దిశ, ఇచ్చోడ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం హర్షణీయం కాదని, అతని వ్యాఖ్యలు ఎంత సమంజసమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు, బీజేపీ కక్ష పూరిత చర్యలను నిరసిస్తూ ఆదివారం ఇచ్చోడ లో ధర్నా చేపట్టారు. ప్రధాన రోడ్డుపై బైఠాయించి, కేంద్ర ప్రభుత్వం, బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ అడపడుచని గమనించకుండా అడ్డమైన రీతిలో మాట్లాడడం శోచనీయమన్నారు.

బీజేపీ నాయకులు కనీసం స్త్రీల గురించి మాట్లాడే ముందు విలువలు పాటించాలన్నారు. కేంద్రంలో మెజార్టీ ఉన్నా కూడా ప్రదాని మోడీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును ఎందుకు ప్రవేశ పెట్టలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ ధర్నాలో నియోజక వర్గంలో తొమ్మిది మండలాల కన్వీనర్లు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, రైతుబంధు అధ్యక్షులు ఆత్మ చైర్మన్లు, బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీలు, ఆయా విభాగాల బాధ్యులు, మహిళ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News