పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అఘోరి మాత.. ఉత్కంఠ..ఉద్రిక్తతతో అర్ధరాత్రి ఇంటికి..

ఎట్టకేలకు అఘోరి మాత భారీ ఎస్కార్ట్ మధ్య అర్ధరాత్రి ఇంటికి చేరింది.

Update: 2024-10-31 04:49 GMT

దిశ,బెల్లంపల్లి: ఎట్టకేలకు అఘోరి మాత భారీ ఎస్కార్ట్ మధ్య అర్ధరాత్రి ఇంటికి చేరింది. దీపావళి పండుగ రోజు ముత్యాలమ్మ టెంపుల్ లో ఆత్మార్పణ చేసుకుంటానని అఘోరి మాత చేసిన సంచలనమైన ప్రకటన తెలిసిందే. అలాంటి అఘాత్యం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం అఘోరి మాతను సిద్దిపేట నుంచి నిన్న అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య నెన్నెల మండలం కుశ్ననపల్లి తన సొంత ఊరికి తరలించింది. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దిన్ ఆధ్వర్యంలో నెన్నెల ఎస్సై ప్రసాద్ పోలీసు బలగాలు అఘోరి మాత ఇంటికి భద్రత గా నిలిచారు.

వేములవాడ టెంపుల్ లో ఉన్న దర్గా పై అగోరి మాత చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని రేపాయి. ముందే ప్రకటించిన విధంగా అఘోరి మాత ఆత్మార్పణ కోసం హైదరాబాదులోని ముత్యాలమ్మ టెంపుల్ కు ప్రయాణంలో ఉంది. అఘోరి మాత అనుపానాలపై డేగ కన్ను పెట్టిన పోలీస్ యంత్రాంగం, ఇంటెలిజెన్స్ వర్గాలు సిద్దిపేటలో అఘోరీ మాతను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుండి భారీ పోలీసు ఎస్కార్ట్ మధ్య మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్ననపెల్లి గ్రామానికి తీసుకొచ్చారు. అఘోరి మాత జీవ సమాధి నుంచి కాపాడేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అఘోరి మాత ఇప్పుడేమీ చేసుకుంటుందోనని ఉత్కంఠ జిల్లాలో నెలకొంది. అఘోరి మాత పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తుందనడంలో సందేహం లేదు.


Similar News