గురుకులంలో అనూహ్య ఘటన.. నిద్రిస్తున్న విద్యార్థిపై మరో విద్యార్థి బ్లేడుతో దాడి

మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని బ్లేడుతో కోసి గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .

Update: 2024-08-19 04:05 GMT

దిశ, మామడ: మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని బ్లేడుతో కోసి గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . విద్యార్థి నిద్రిస్తున్న సమయంలో తోటి విద్యార్థి కాలు పై బ్లేడుతో కోసి గాయపరిచారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో గాయపడిన విద్యార్థి ఆదివారం రాత్రి తన తండ్రికి ఫోన్ ద్వారా ఈ విషయాన్ని చెప్పడంతో విద్యార్థిని ఇంటికి తీసుకువెళ్లారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News