electric shock : పండగ పూట విషాదం.. విద్యుత్ షాక్ తో రైల్వే సివిల్ ఇంజనీర్ మృతి..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే కాలనీలో జూనియర్ సివిల్ ఇంజనీర్ విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన విషాదం నింపింది.

Update: 2024-10-30 08:46 GMT

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే కాలనీలో జూనియర్ సివిల్ ఇంజనీర్ విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. బెల్లంపల్లి రైల్వేకాలనీకి చెందిన సాయి హిమాన్షు (29) తన నివాసంలో మంగళవారం రాత్రి ఎలక్ట్రికల్ విద్యుత్ దీపాలు అలంకరిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సాయి హిమాన్షుకు భార్య పిల్లలు ఉన్నారు. ఈ మేరకు బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News