Accident : రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 52 మంది దుర్మరణం

అఫ్గానిస్తాన్‌లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 52 మంది దుర్మరణం పాలయ్యారు.

Update: 2024-12-19 10:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అఫ్గానిస్తాన్‌లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 52 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 65 మంది గాయాలపాలయ్యారు. గజిని ప్రావిన్స్‌ కాబుల్-దక్షిణ కాందహార్ హైవేపై ఈ యాక్సిడెంట్‌లు చోటు చేసుకున్నాయి. గజిని ప్రావిన్స్‌లోని షెహబాబ్ గ్రామంలో సమీపంలో ఆయిల్ ట్యాంకర్ బస్సు ఢీకొట్టింది. తూర్పు అందార్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాయి. తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడారు. ‘కాబుల్-కాందహార్ హైవేపై రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 52 మంది మరణించగా.. మరో 65 మందికి గాయాలయ్యాయి. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారిని కాబుల్ ఆస్పత్రికి తరలించాం. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ సంఘటనలు మమ్మల్ని తీవ్రంగా కలిచివేశాయి. రెండు ఘటనలపై తక్షణ విచారణ చేపట్టాం. భవిష్యత్తులో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు చేపడతాం.’ అని ఆయన అన్నారు. 

Tags:    

Similar News