R Ashwin : ఐపీఎల్‌‌లో ఆడటంపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు

అంతర్జాతీయ క్రికెట్‌కు రిట్మైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ సీఎస్కేకు వీలైనన్ని రోజులు ఆడతా అన్నాడు.

Update: 2024-12-19 09:06 GMT

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్‌కు రిట్మైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ సీఎస్కేకు వీలైనన్ని రోజులు ఆడతా అన్నాడు. గురువారం చెన్నైకు చేరుకున్న అశ్విన్‌కు ఇంటి వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అశ్విన్ మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాను. అందుకే కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోలేదు. సీఎస్కే తరఫున వీలైనన్ని రోజులు ఆడతాను. నా క్రికెట్ కెరీర్ ముగియలేదు. కేవలం అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రమే నేను రిటైర్మెంట్ ప్రకటించాను. ఇంటి వద్దకు ఇంత మంది అభిమానులు వస్తారని అనుకోలేదు. ఎలాంటి హడావుడి లేకుండా ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నా. కానీ మీరంతా ఈ రోజును స్పెషల్‌గా మార్చారు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇలాంటి స్వాగతమే లభించింది. ఆ జ్ఞాపకాలు ఒక్కసారిగా మదిలో మెదిలాయి.’ అని అశ్విన్ అన్నాడు. టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనుందుకు చింతిస్తున్నారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. నవ్వుతూ నేను ఇప్పుడు హ్యాపీగా ఉండటాన్ని మీరు చూస్తున్నారు. నేనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించాను. కెప్టెన్సీ విషయంలో ఎలాంటి బాధ లేదు. కెప్టెన్సీ దక్కనందుకు బాధ పడిన వ్యక్తులను చూశాను. నాకు మాత్రం ఎలాంటి విచారం లేదని అశ్విన్ అన్నాడు.

Tags:    

Similar News