R Ashwin : అశ్విన్‌కు సరైన రీతిలో వీడ్కోలు లభించలేదు : కపిల్ దేవ్

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్‌కు సరైన రీతిలో వీడ్కోలు లభించలేదని మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నాడు.

Update: 2024-12-19 11:50 GMT

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్‌కు సరైన రీతిలో వీడ్కోలు లభించలేదని మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నాడు. జాతీయ మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. ‘భారత అత్యుత్తమ క్రికెటర్‌లో ఒకడైన అశ్విన్ రిట్మైర్మెంట్‌ నిర్ణయంతో షాక్‌కు గురయ్యాను. ఈ పరిణామంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. అశ్విన్ మొఖంలో తెలియని బాధ కనిపించింది. అతను సంతోషంగా లేడు. అది బాధాకరం. అతనికి ఘనమైన వీడ్కోలు దక్కాల్సింది. భారత గడ్డపై అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుండేంది. దేశం తరఫున 106 టెస్టులను అతను ఆడాడు. అతన్ని గౌరవించడం మన బాధ్యత. భారత్‌కు అశ్విన్ అందించిన సేవలను మరో ఆటగాడు భర్తీ చేయలేడు. నేను ఆ సమయంలో అక్కడ ఉండి ఉంటే అతన్ని ఆటకు వీడ్కోలు చెప్పకుండా ఆపేవాడిని. భారత్‌ను అనేక మ్యాచ్‌ల్లో గెలిపించిన అశ్విన్‌కు బీసీసీఐ గొప్ప వీడ్కోలు ప్లాన్ చేస్తుందని అనుకుంటున్నా..’ అని కపిల్ దేవ్ అన్నాడు. 

Tags:    

Similar News