రేపు మంచిర్యాల జిల్లా బంద్ కు పిలుపు
గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాల జిల్లా బంద్ కు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు.
దిశ, మంచిర్యాల టౌన్ : గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాల జిల్లా బంద్ కు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆమె మాట్లాడారు.
గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా రైతులు ఆమరణ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా చేసే ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కొక్కిరాల సురేఖ తెలియజేశారు.