నీళ్ల కోసం అప్పులు... పంట కోసం తిప్పలు..!

పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్త బోర్లను వేసినీళ్లతో పంటను కాపాడుకునేందుకు అప్పులపై అప్పులు చేస్తున్నారు.

Update: 2023-03-10 15:16 GMT

దిశ, కుబీర్ : పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్త బోర్లను వేసినీళ్లతో పంటను కాపాడుకునేందుకు అప్పులపై అప్పులు చేస్తున్నారు. ఒక బోరుకు నీళ్లు పడకపోతే... పోటీపడి మరో బోరును వేసి పోటీపడి నీళ్ళురాక అప్పుల పాలవుతున్నారు. ఇటీవల నెల రోజుల్లో ఒకచిన్న పల్లెటూల్లో 30కొత్త బోర్లు వేస్తారు. అందులో పనిచేస్తున్నది మాత్రం ఒకే ఒక్క బోరుమాత్రమే. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ధార్ కుబీర్ చిన్నపల్లెటూరు. కొంతకాలంగా మొక్కజొన్న పంటను సాగుచేసి అధిక దిగుబడిలు సాధిస్తన్నది.

ఇటీవల కొన్ని రోజులుగా భూగర్భ జలం రోజురోజుకు పాతాళానికి పడిపోతుండడంతో ఉన్నబోర్లు వట్టిపోయాయి. కొన్నిరోజుల్లోనే కొత్తగా 30 బోర్లు వేశారు. ఒక దానికి నీళ్లు పడకపోయినా పోటీపడి కొందరు రెండు మూడు కూడా వేశారు. ఇందులో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. వేలకుంటలను పండించినకు గ్రామం, సగం దిగుబడులను సాధిస్తాం అన్ననమ్మకం లేదని రైతులంటున్నారు. అన్నదాతలు భగీరథ ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఒక పక్క కొత్తబోర్లకు నీళ్లుపడక అప్పులను మిగిల్చింది.

వేల రూపాయల పెట్టుబడి పెట్టిన మొక్కజొన్న పంట ఎండు ముఖం పడుతుండడంతో ఆందోళన పడుతున్నారు. వానాకాలంలో అతివృష్టితోనూ నష్టపోగా, ప్రస్తుతం భూగర్భ జలాలు అడగంటడంతో నష్టపోతున్నామన్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న సాయం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ భీమా పథకం అమల్లో ఉన్న రైతులకు లాభం జరిగేదని అంటున్నారు.

Tags:    

Similar News