Formula E-Race Case: కేటీఆర్‌పై కేసులో కీలక మలుపు
కేటీఆర్(KTR)పై కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎఫ్‌ఐఆర్ కాపీ(FIR Copy)ని నాంపల్లి కోర్టుకు ఏసీబీ(ACB) అధికారులు సబ్మిట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్(KTR)పై కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎఫ్‌ఐఆర్ కాపీ(FIR Copy)ని నాంపల్లి కోర్టుకు ఏసీబీ(ACB) అధికారులు సబ్మిట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ ప్రజాప్రతినిధి కావడంతో పీసీ యాక్ట్(PC Act) కింద కేసు నమోదు చేశారు. హెచ్‌ఎండీఏ(HMDA) బోర్డు, ఆర్థికశాఖ, ఆర్బీఐ(RBI) అనుమతి లేకుండానే రూ.55 కోట్ల ప్రభుత్వ నిధులను విదేశీ సంస్థకు చెల్లించడంపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని పేర్కొన్నారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. లేఖ రాసిన మరుసటి రోజే కేటీఆర్‌పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.