కౌన్ బనేగా ఎమ్మెల్సీ.. 5 పోస్టులకు 30 మంది పోటీ?

త్వరలోనే టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ పదవుల పండుగ మొదలుకానుంది. కానీ అవి ఎవరికి దక్కుతాయనేది సస్పెన్స్. ఎమ్మెల్యే, గవర్నర్ కోటా కింది ప్రస్తుతం కొనసాగుతున్న ఐదుగురి పదవి కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది.

Update: 2022-10-23 02:57 GMT

త్వరలోనే టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ పదవుల పండుగ మొదలుకానుంది. కానీ అవి ఎవరికి దక్కుతాయనేది సస్పెన్స్. ఎమ్మెల్యే, గవర్నర్ కోటా కింది ప్రస్తుతం కొనసాగుతున్న ఐదుగురి పదవి కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. దీంతో ఆశావహులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పైరవీలు కూడా ప్రారంభించారు. ఈ పదవుల విషయంలో ఇప్పటికే కొందరికి సీఎం కేసీఆర్ కొందరికి హామీ ఇచ్చారు. మరి మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న తమ పరిస్థితి ఏంటని నేతలు మదన పడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్‌లో త్వరలోనే ఎమ్మెల్సీ పదవుల పండుగ ప్రారంభం కానుంది. మార్చిలో ఎమ్మెల్యే, గవర్నర్ కోటా కింద 5 ఎమ్మెల్సీ పదవుల ఖాళీ కానున్నాయి. వీటిని దక్కించుకునేందుకు సుమారు 30 మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పైరవీలు కూడా మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ పదవుల విషయంలో సీఎం కేసీఆర్ గతంలో చాలా మంది నాయకులకు హామీ ఇచ్చారు. ఇటీవల పార్టీలో చేరిన వారికి సైతం పదవుల విషయంలో మాటిచ్చారు. దీంతో తమకు పదవి దక్కుతుందో లేదోననే ఆందోళన ఆశావహుల్లో మొదలైంది.

లేదంటే ఎమ్మెల్యే టికెట్!

ఎమ్మెల్యే కోటాలో కొనసాగుతున్న ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధరగౌడ్, నీవన్ కుమార్, గవర్నర్ కోటాలో కొనసాగుతున్న రాజేశ్వరరావు, ఫారూక్ హుస్సేన్ పదవీకాలం మార్చి 2023లో ముగియనుంది. ఆ స్థానాల్లో ఎవరెవరిని భర్తీ చేయాలో సీఎం కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. ఇందుకు సంబంధించి సదరు నేతలకు సైతం సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో ఆశావాహులు మరింత అలర్ట్ అవుతున్నారు. తమకు కూడా చాన్స్ ఇవ్వలని కోరుతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన లీడర్లు, చాలా కాలంగా పార్టీలో కొనసాగుతున్న నాయకులు ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ పదవి దక్కకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను తెరమీదకు తెస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ పదవి కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి పదవి ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ లేదంటే ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు ఇదే దారిలో ఉన్నారు. మాజీ మంత్రులు ఇనుగాల పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మండవ వెంకటేశ్వరరావు సైతం ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కని క్యామా మల్లేశం, మేడ్చల్‌కు చెందిన రాజశేఖర రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, నాగేందర్ గౌడ్, పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్, వంగేటి లక్ష్మారెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సారి తనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఆశతో ఉన్నారు. వీరే కాకుండా మాజీ ఎమ్మెల్సీ సలీం, బండి రమేష్, పీఎల్ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నాగుల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, సుందర్ రాజు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, గుడిమల్ల రవికుమార్, కర్నె ప్రభాకర్, చాడా కిషన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రెడ్డి, బొడకుంటి వెంకటేశ్వర్లు సైతం ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

పార్టీ వీడితేనే ప్రాధాన్యమా?

ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవులు విషయంలో హామీ ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తున్నది. బీజేపీలో ఉన్న స్వామిగౌడ్, బూడిద భిక్షమయ్యగౌడ్‌ను ఇటీవలే టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని వారికి సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. మరి మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నాయకులకు పదవులు ఇవ్వకపోతే ఎలా? అనే చర్చ కొనసాగుతున్నది.

ఇవి కూడా చదవండి: కౌన్ బనేగా ఎమ్మెల్సీ.. 5 పోస్టులకు 30 మంది పోటీ? 

ఇవి కూడా చదవండి: మునుగోడు బైపోల్ ఎఫెక్ట్: నలిగిపోతున్న సీఈవో ఆఫీస్ స్టాఫ్! 

Tags:    

Similar News