స్వస్థలాలకు చేరుకున్న కాశీ యాత్రికులు

దిశ, కరీంనగర్: లాక్‌డౌన్‌కు ముందు కాశీ విశ్వేశ్వరుణ్ని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి వెళ్లిన పలువురు యాత్రికులు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన 46 మంది, సిరిసిల్ల జిల్లాకు చెందిన ఏడుగురు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు 50 రోజుల క్రితం కాశీ యాత్రకు వెళ్లారు. అదే సమయంలో లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో వీరంతా అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వారణాసి […]

Update: 2020-05-05 03:40 GMT

దిశ, కరీంనగర్: లాక్‌డౌన్‌కు ముందు కాశీ విశ్వేశ్వరుణ్ని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి వెళ్లిన పలువురు యాత్రికులు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన 46 మంది, సిరిసిల్ల జిల్లాకు చెందిన ఏడుగురు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు 50 రోజుల క్రితం కాశీ యాత్రకు వెళ్లారు. అదే సమయంలో లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో వీరంతా అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వారణాసి కలెక్టర్‌తో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపించడంతోపాటు, భోజన వసతి కల్పించాలని కోరారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని స్వస్థలాలకు పంపించే వెసులుబాటు కల్పించడంతో రాష్ట్ర నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మాట్లాడి వారిని స్వస్థలాలకు రప్పించేందుకు కృషి చేశారు. దీంతో మంగళవారం జిల్లాల సరిహద్దుల్లోకి చేరుకున్న యాత్రికులను వైద్య అధికారులు పరీక్షించి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు. అనంతరం అందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

Tags: Telangana people, Kashi Yatra, returned, karimnagar, varanasi collecter

Tags:    

Similar News