Lenovo: మార్కెట్లోకి AI ఫీచర్లతో సరికొత్త Lenovo యోగా స్లిమ్ ల్యాప్‌టాప్

ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ Lenovo ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది.

Update: 2024-08-07 15:02 GMT

దిశ, టెక్నాలజీ: ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ Lenovo ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దాని పేరు ‘Lenovo యోగా స్లిమ్ 7x’. ఇది Copilot+ AI ఫీచర్‌తో వచ్చింది. శక్తివంతమైన చిప్‌సెట్, మెరుగైన బ్యాటరీ లైఫ్‌‌తో అడుగుపెట్టింది. ల్యాప్‌టాప్ సన్నగా ఉంటుందని, AI పనితీరుకు సహాయపడే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)తో వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. Copilot+తో పాటు, టెక్స్ట్-టు-ఇమేజ్ కన్వర్షన్, టెక్స్ట్ క్రియేషన్, అడ్వాన్స్‌డ్ ఫోటో, వీడియో ఎడిటింగ్ ఇంకా మరిన్ని AI-మద్దతు గల ఫీచర్‌లు ఉన్నాయి. దీని ధర రూ.1,50,990. లెనోవా ఇండియా వెబ్‌సైట్, లెనోవా ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, ఈ-కామర్స్ సైట్‌లు, ఎంపిక చేసుకున్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Lenovo యోగా స్లిమ్ 7x ఫీచర్లు

14.5-అంగుళాల 3K (2,944 x 1,840 పిక్సెల్‌లు) OLED యాంటీ-గ్లేర్ టచ్ స్క్రీన్‌తో 1,000 nits పీక్ బ్రైట్‌నెస్, 7x 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది Qualcomm Adreno GPUతో 32GB RAM,1TB స్టోరేజ్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ X ఎలైట్ X1E-78-100 ప్రాసెసర్‌ ద్వారా పనిచేస్తుంది. విండోస్ 11 హోమ్‌లో రన్ అవుతుంది. యూజర్లు ఎక్కువ సమయం వాడుకునేలా 7x 70Wh బ్యాటరీని అందించారు. దీనికి రాపిడ్ చార్జ్ ఎక్స్‌ప్రెస్ టెక్నాలజీ సపోర్ట్ ఉంది, దీంతో ఇది 15 నిమిషాల చార్జ్‌తో 3 గంటల రన్‌టైమ్‌ను అందిస్తుంది. యూజర్ల వీడియో కాల్ కోసం పూర్తి-HD(1080p) వెబ్‌క్యామ్‌ను ఏర్పాటు చేశారు. కనెక్టివిటీ పరంగా Wi-Fi 7, బ్లూటూత్ 5.3 ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ బరువు 1.28kg.

Tags:    

Similar News