Nokia 3310: నోకియా ఫోన్ అంటే మాటలా? 20 ఏళ్ల తర్వాత కూడా 70% బ్యాటరీ.. వైరల్

మొబైల్ ఫోన్ల చరిత్రలో నోకియా ఫోన్లు ఒక దిగ్గజం. వాటిలో చాలా బేసిక్ మోడల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Update: 2025-03-15 05:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మొబైల్ ఫోన్ల చరిత్రలో నోకియా ఫోన్లు ఒక దిగ్గజం. వాటిలో చాలా బేసిక్ మోడల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటికీ ఆ బేసిక్ ఫోన్లు అందుబాటులో లేకున్నా కూడా వాటి మోడల్స్ గురించి తరుచుగా ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే నోకియా ఫోన్ల స్ట్రాంగ్ బ్యాటరీ, బాడీనే అందుకు కారణం. ముఖ్యంగా నోకియా 3310 బేసిక్ ఫోన్ అయిన ఎవరు నాశనం చేయలేరని ఒక పేరు కూడా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట నోకియా 3310 మోడల్ గురించి ఒక కథనం వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్‌కు చెందిన ఎల్లెస్మెర్ పోర్ట్ నివాసి 20 ఏళ్ల తర్వాత తన నోకియా 3310 మోడల్ ఫోన్‌ను కనుగొన్నాడు. అది కూడా 70% బ్యాటరీ లైఫ్‌తో ఉన్నట్లు గుర్తించాడు. రెండు దశాబ్దాల తర్వాత కూడా బ్యాటరీ చెక్కు చెదరకుండా ఉండటం చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఇక, అతని కొడుకు స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చినప్పటికీ, అతను తన పాత నోకియాతోనే ఉండాలని ఎంచుకున్నాడు. స్నేక్ 2 గేమ్ కూడా ఆడుతున్నట్లు తెలిసింది. ఈ ఘటన 2019లో జరిగినట్లుగా తెలుస్తోంది.

కాగా, ఇలాంటి ఘటనలు తరుచూ వినిపిస్తూనే ఉన్నాయి. 2024లో కూడా వేల్స్‌లోని పాంటిప్రిడ్‌లో ఒక వ్యక్తికి 22 ఏళ్ల తర్వాత తన పాత నోకియా 3310ని కనుగొన్నాడు. అందులో కూడా బ్యాటరీ ఛార్జ్ అలాగే ఉన్నట్లు గుర్తించాడు. నోకియా 3310 దాని దాదాపు నాశనం చేయలేని నిర్మాణం, దీర్ఘ బ్యాటరీకి ప్రసిద్ధి చెందింది. దశాబ్దాల తర్వాత కూడా సాధారణంగానే పని చేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు ఇదెలా సాధ్యం అంటూ ప్రశ్నిస్తున్నారు. నోకియా ఫోన్ అంటే మాటలా? అవి లెజెండ్ ఫోన్స్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా, నోకియా ఫోన్లు కాలానికి అనుగుణంగా మార్పులు చెందుతూ వచ్చింది. నేడు స్మార్ట్ ఫోన్‌ల రూపంలో పలు దేశాల్లో నోకియా ఫోన్ లభిస్తోంది.

Read More..

social media: సోషల్ మీడియాలో బూతు కామెంట్లపై తిరుగుబాటు.. ఇక సోషల్ మీడియాకు ఆధార్ మస్ట్?  

Tags:    

Similar News