Viral video: దేవుడా.. చివరకి ఇవి కూడా ఫేక్ వచ్చాయా?
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు (Google) చెందిన వీడియో కంటెంట్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (Youtube) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు (Google) చెందిన వీడియో కంటెంట్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (Youtube) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ (Smart Phone) ఉన్న ప్రతి ఒక్కరూ రోజులో ఒక్కసారైనా యూట్యూబ్ ఓపెన్ చేసి, నచ్చిన సమాచారాన్ని వీక్షిస్తారు. ఇక ఇందులో ఎవరైనా సరే సొంతంగా ఛానెల్ క్రియేట్ చేసుకుని వీడియోలు తీసి అప్‌లోడ్ చేయవచ్చు. మంచి వ్యూస్ వస్తే చాలు దానికి తగ్గట్లుగానే ఆదాయం వస్తుంది. ఈ క్రమంలో కంటెంట్ క్రియేటర్లను ఎంకరేజ్ చేసేందుకు ప్లే బటన్ అవార్డులను అందిజేస్తుంది. లక్ష మంది సబ్‌స్క్రైబర్లు దాటితే, సిల్వర్, 10 లక్షలు దాటితే గోల్డ్, కోటి మంది సబ్‌స్క్రైబర్లు దాటితే ప్లాటినం.. ఇలా ప్లే బటన్లను అందజేస్తుంది. ఇది అందరికి తెలిసిన సంగతే కదా ఇప్పుడెందుకు దీని గురించి అనుకుంటున్నారా? అయితే, ఈ ప్లే బటన్లకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే?
ఓ చిన్న వెల్డింగ్ షాపులో ఓ వ్యక్తి కూర్చుని తన పని చేసుకుంటున్నాడు. రెండు రేకు పలకలకు చక్కగా వెల్డింగ్ చేసి అతికించాడు. అనంతరం వాటిపై కలర్ వేసి, వాటిపై పేర్లను కూడా అతికించి అచ్చం యూట్యూబ్ ప్లే బటన్ల మాదిరిగా తయారు చేశాడు. ఇలా అతడి షాపులో పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్లను హైడ్ చేసే ఆప్షన్ ఉండే ఇది సాయపడుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇండియాకు స్వాగతం.. ఎక్కడైతే మీరు మొత్తం ప్రపంచాన్నే చీప్‌గా పొందవచ్చు మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఓఎంజీ యూట్యూబ్ ప్లే బటన్ కూడా నకిలీవి తయారు చేస్తున్నారా అంటూ మరికొందరు షాక్ రియాక్షన్ ఇస్తున్నారు.
కాగా, ఇండియాలో మొత్తం ఎన్ని యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయనేది కచ్చితంగా చెప్పలేం. కానీ, రోజుకు లక్షకు పైగా వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. అలాగే, 2029 నాటికి, యూట్యూబ్ వినియోగదారుల సంఖ్య 859.26 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా
YouTube was not ready for this..!!#Jugaad @YouTubeIndia @YouTube pic.twitter.com/dcsKVKf7uB
— Vije (@vijeshetty) March 12, 2025