Dragon Crew: భూమిపైకి సునీతా విలియమ్స్ డేట్ ఫిక్స్! ఐఎస్ఎస్‌లోకి ప్రవేశించిన అస్ట్రోనాట్స్

గత 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకు రానున్నారు.

Update: 2025-03-16 07:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గత 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకు రానున్నారు. వారిని తీసుకొచ్చేందుకు వెళ్లిన నలుగురు వ్యోమగాములు (Dragon Crew) ఐఎస్ఎస్‌లోకి విజయవంతంగా ప్రవేశించారు. కొత్త క్రూకు అస్ట్రోనాట్స్ వెల్ కమ్ చెప్పినట్లు నాసా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం విడుదల చేసింది. శనివారం నాసా-స్పేస్ఎక్స్ చేపట్టిన ‘క్రూ-10’ మిషన్‌లో కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఆదివారం ఉదయం ఫాల్కన్-9 రాకెట్ ఐఎస్ఎస్‌కు చేరుకుంది. క్రూ-10 మిషన్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయినట్లు నాసా తెలిపింది.

డ్రాగన్ స్పేస్‌‌క్రాఫ్ట్‌లో అమెరికా, జపాన్, రష్యాకు చెందిన నలుగురు వ్యోమగాములు అన్నె మెక్లెయిన్‌, నికోల్‌ అయర్స్‌, టకుయా ఒనిషి, కిరిల్‌ పెస్కోవ్‌ ఐఎస్ఎస్‌‌కు పంపారు. ఈ డ్రాగన్ సిబ్బంది ఐఎస్ఎస్‌లోకి విజయవంతంగా ప్రవేశించారు. ప్రస్తుతం ఐఎస్ఎస్‌లో 11 మంది అస్ట్రోనాట్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ కొత్త టీమ్‌కి సునీతా విలిమయ్స్, బుచ్ విల్మోర్‌లు బాధ్యతలు అప్పగించి.. మార్చి 19న భూమికి తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉందని నాసా వర్గాలు వెల్లడించాయి. ఇది మరో చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుందని, నిజంగా ఎంతో ఆనందించదగ్గ విషయమని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన స్పెస్ ఎక్స్ సహకారంలతోనే వారు భూమిపైకి రావడం సాధ్యపడుతుందని నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రయోగం సక్సెస్ అవ్వడంతో భూమికి అడుగు దూరంలోనే సునీతా విలియమ్స్ నెటిజన్లు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్రపంచం మొత్తం సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సురక్షితంగా తిరిగి రావాలని ఎదురు చూస్తోంది.

Tags:    

Similar News