‘ఏమ్మా.. మా పవనన్న గ్లాస్ లేదా?’.. మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు(వీడియో వైరల్)

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్‌లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.

Update: 2025-03-16 10:41 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్‌లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న(శనివారం) స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు.

ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికులను మంత్రి ప్రశంసించారు. మంగళగిరిని పరిశుభ్రంగా మార్చారని కొనియాడారు. మంగళగిరి ఎకో పార్క్ బాగుందని, మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి లోకేష్(Minister Nara Lokesh) పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆల్ఫా అరేబియన్ రెస్టారెంట్ వద్ద టీ తాగారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర వీడియోను మరో మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Vasamsetti Subhash) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మంత్రి లోకేష్‌తో సహా అందరికీ టీ అందిస్తుండగా.. ఏమ్మా, పవనన్న గ్లాస్ లేదా, ఈ గ్లాసులో ఇచ్చావు.. పవనన్న గ్లాస్ లో ఇవ్వాల్సింది కదా! అంటూ లోకేష్ సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలో నారా లోకేష్ మాటలకు అందరూ నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమా(Social media)ల్లో వైరల్‌గా మారింది.

READ MORE ...

Nara Lokesh:రేపటి నుంచే పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు మంత్రి కీలక సూచనలు


Tags:    

Similar News