ముందు ధోతి కట్టుకోండి.. తర్వాత మహిళలు ఏమి ధరించాలో చెప్పండి.. స్త్రీ వస్త్రధారణపై చర్చ

మహిళల దుస్తుల ఎంపిక, (Women's attire) వారు ఏం ధరించాలనే వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.

Update: 2025-03-16 12:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళల దుస్తుల ఎంపిక, (Women's attire) వారు ఏం ధరించాలనే వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సంస్కృతిని కాపాడుకోవడం అంటే స్త్రీ దుస్తులను నిర్దేశించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మనం ఎప్పుడూ స్త్రీలు చీరలు కట్టుకోవాలని ఆశిస్తాం.. కానీ పురుషులు ధోతీ కట్టుకుని ఓ పెద్ద షాపింగ్ మాల్‌లోకి వెళ్ళమని సవాల్ చేశారు. ముందుగా పురుషులు అలా చేయండి ఎందుకంటే మీరు అలా చేయగలిగినప్పుడు, సంస్కృతిని కాపాడుకోవడానికి మహిళలు ఏమి ధరించాలో చెప్పే హక్కు మీకు ఉంటుందని ఓ నెటిజన్ తెలిపారు. ఈ చాలేంజ్ స్వీకరించాలని బాయ్స్‌కు సూచిస్తున్నారు.

స్త్రీ చీర కడితేనే సంస్కృతిని కాపాడినట్లా? అని నెటిజన్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కల్చర్‌లో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా సమానత్వంగా ఉండాలని, మీకు నచ్చిన దుస్తులు వేసుకోవాలని సూచిస్తున్నారు. కాగా, మహిళల డ్రెస్సింగ్‌‌ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత గతంలోనే స్పందించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి చెందిన మహిళా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. మహిళల దుస్తుల ఎంపికను గౌరవించాలని రాహుల్ అన్నారు. ఒక మహిళ ఏం ధరించాలన్నది ఆమె వ్యక్తిగత విషయం.. అందుకు అనుమతించాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.. దానిని మరొకరు నిర్దేశించాలని నేను అనుకోను.. అంటూ రాహుల్ చెప్పారు. కాగా, గతంలో మహిళల వస్త్రధారణపై బీహార్‌ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాను అధికారం చేపట్టిన 20 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని మహిళల వస్త్రధారణ మెరుగుపడిందంటూ వ్యాఖ్యానించారాయన. దీనిపై గతంలో సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

READ MORE ...

Guinness World Record: ప్రపంచ రికార్డు సాధించిన 108 ఏళ్ల.. వయసులో కాదు!



Tags:    

Similar News